మన తెలుగు వారికే కాదు, ప్రపంచ దేశాల అధినేతలకు సుపరిచితమయిన, పరిచయం అవసరం లేని పేరు చంద్రబాబు నాయుడు. అంతటి ప్రముఖ నాయకుడు చంద్రబాబు ‘’శేఖర్’’ అనే పేరు విని కాస్త భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ జీవితం ఇద్దరు ‘’శేఖర్లు’’ వల్ల అయోమయంలో పడిపోయిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మొదటగా చెప్పుకుంటే ఆయన రాజకీయ జీవితానికే అస్థిత్వం తెచ్చిన వారిలో ప్రముఖులు దివంగత నేత రాజ “శేఖర్” రెడ్డి ప్రధముడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2004లో ముఖ్యమంత్రిగా పదవీ భాధ్యతలు స్వీకరించాక ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన టిడిపిని చాలా సందర్భాలలో ఇరుకున పెట్టారు. అంతేకాదు, ప్రతిపక్షానికి పెద్దగా పని లేకుండా చేసి, “మిషన్ ఆకర్ష్” పేరుతో టిడిపి నేతలకు ‘అభయ హస్తం’ అందించి, ఆ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేసారు, అందులో కొంతమేరకు విజయం సాధించారు కూడా రాజ“శేఖర్”రెడ్డి గారు! అప్పుడు పార్టీ వర్గాలను నియత్రించలేక ఎవరి అభీష్టానికి వారిని వదిలేస్తూ చూస్తూ ఉండిపోయారు చంద్రబాబు.
మళ్ళీ ఆ పరిస్థితులు బాబు గారికి మరలా ఇప్పుడు ఎదురయింది. తెలుగు వారు రెండు రాష్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు సిఎంగా బాబు గారు, తెలంగాణా ప్రాంతానికి సిఎంగా చంద్ర“శేఖర్”రావు గారు ఎంపికయ్యారు. అయితే ఈ ‘’శేఖర్’’ కూడా బాబుకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. “ఆపరేషన్ ఆకర్ష్” పేరుతో తెలంగాణాలో టిడిపి నాయకులను ఒక్కొక్కరిగా ఈ “శేఖర్” దత్తత తీసుకుంటూ టిడిపిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఈ విషయంలో ప్రస్తుతానికి ఈ “శేఖర్” పూర్తిగా విజియం సాధించారు. మొత్తానికి ఇద్దరు “శేఖర్”లు బాబు గారి పాలిట “బొమ్మాలి”లుగా మారారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.



