చంద్రబాబు భావాలతో ఏకీభవించిన కాపు సంఘాలు!

Chandrababu-naidu-kapu-issue
తుని సంఘటన నేపధ్యంలో 13 కాపు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు, నారాయణలు కూడా భాగస్వామ్యులయ్యారు.

కమిటీ నివేదికను తొమ్మిది నెలల నుంచి మూడు నెలల లోపు తెప్పించి చర్చించాలని, కాపుల సంక్షేమ సంఘానికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు పలు ప్రతిపాదనలు చేయగా, సీఎం సానుకూలంగా స్పందించారని కాపు సంఘాల నేతలు పేర్కొన్నారు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, “తాము శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నామని, సాంకేతిక అంశాలను పరిష్కరించి ముందుకెళ్ళాలని చూస్తున్నామని, లేని పక్షంలో జీవో జారీ చేయమంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వాటిని నిలిపివేసే అవకాశం ఉందని” ముఖ్యమంత్రి స్పష్టమైన సమాచారాన్ని కాపు సంఘాల నాయకులకు తెలిపినట్లుగా సమాచారం. దీంతో చంద్రబాబు ప్రతిపాదనలకు కాపు సంఘాల నేతలు సుముఖత వ్యక్తం చేసారు.

ADVERTISEMENT
Latest Stories