చంద్రబాబుకు ముందు నుయ్యి… వెనుక గొయ్యి..!

chandrababu-naidu-in-dilemaకుల రాజకీయాలు చంద్రబాబు నెత్తిపై కుంపటిలా మారుతున్నాయి. ఓ వైపు కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఆమరణ దీక్ష… మరో వైపు ఇది సమ్మతిస్తే ప్రభుత్వాన్ని దించేస్తామంటూ ‘రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక’ హెచ్చరికలు..! దీంతో రాజకీయ వ్యూహాలతో చంద్రబాబు నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు.

ADVERTISEMENT

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టి మూడు రోజులవుతున్న నేపథ్యంలో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో నేటి ఉదయం వారిద్దరికీ వైద్యులు బలవంతంగా పరీక్షలు చేయబోయారు. అయితే వైద్య పరీక్షలకు ముద్రగడ ఒప్పుకోని తరుణంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ లతో పాటు మరికొంతమంది పోలీసులు కూడా తన ఇంటిలోకి ప్రవేశించడంతో ముద్రగడ ఆగ్రహోదగ్రులయ్యారు. ఎక్కడ తన దీక్షను భగ్నం చేస్తారోనన్న ఆందోళనతో తనకు తాను స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరో వైపు కాపులకు రిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక రంగంలోకి దిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్ని కలిసి ‘రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక’ పేరుతో ఏకమయ్యాయి. తిరుపతిలో ప్రారంభమైన వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వేదిక నేతలు మీడియాతో మాట్లాడుతూ… అన్ని రంగాల్లో అభివృద్ది చెందిన కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వాన్ని కూలదోస్తామని చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజా పరిస్థితులతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యిలా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories