
హైకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వస్తే దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఏసీబీ కోర్టు భావించింది. కానీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మరో రెండు రోజులు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించడం అనివార్యమని ముందే స్పష్టమైంది.
చంద్రబాబు నాయుడి కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పోలీసులు వేసిన పిటిషన్‌పై నేడు తీర్పు చెప్పవలసి ఉంది. బహుశః దానిని కూడా హైకోర్టు తీర్పు వెలువడేవరకు వాయిదా వేసే అవకాశం ఉంది. అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై రేపు (శనివారం) విచారణ జరుగుతుంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడుని మళ్ళీ అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రులు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. కనుక ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. దానిపై ఏసీబీ కోర్టు ఈనెల 26వ తేదీన విచారణ చేపట్టనుంది.
చంద్రబాబు నాయుడుపై వరుసపట్టి ఇన్ని కేసులు నమోదు చేయిస్తుండటం ద్వారానే వైసీపి ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని అర్దమవుతోంది. కనుక ఈ కేసులపై ఓ పక్క న్యాయపోరాటం చేస్తూనే, టిడిపి రాజకీయపోరాటం కూడా చేస్తూ వైసీపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు మౌనం వహిస్తుండటంతో జగన్ ప్రభుత్వానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లే భావించవచ్చు. అందుకే టిడిపి రాజకీయ ఒత్తిళ్ళకు ఏమాత్రం లొంగడం లేదు. కనుక ఇప్పుడు టిడిపియే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసి ఉంది.
Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…
Vaani Kapoor brings a rich, moody twist to festive dressing in this striking navy and…