
వైసీపీ అధినేత, రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఘటన చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిక్కుకున్నాయి. దాడికి బాధ్యత బాబు అంటూ అధికార వైసీపీ ఆరోపిస్తుంటే.., ఇక మీ డ్రామాలు చాలు ఆపండి అంటూ ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
నిన్న తెనాలిలో జరిగిన వారాహి యాత్రలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పైన జరిగిన దాడి ఘటన పై స్పందిస్తూ ప్రతిసారి ఎన్నికల ముందు జగన్ కు ఎదో ఒక గాయం జరగడం, ఎవరో ఒకరు చనిపోవడం ఆనవాయితీగా మారిపోయిందని, జగన్ ఒక్కడికి గాయం జరిగితే రాష్ట్రానికంతా గాయం జరిగినట్లు వైసీపీ భావిస్తుండడం చాల బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, వాటి ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారని, అందులో భాగంగా తన అక్క కోసం పోరాడిన అమర్నాధ్ అనే చిన్న పిల్లాడి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఉదంతాన్ని, అనంతబాబు బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతాన్ని మరోసారి ప్రజలదృష్టికి తెచ్చారు పవన్.
జగన్ కు చిన్న దెబ్బ తగిలితేనే ఇంతలా హడావుడి చేస్తున్న వైకాపా నాయకులు మరి వైసీపీ దాష్టికానికి బలైన సాధారణ ప్రజల పట్ల కనీసం సానుభూతి అయినా చూపించారా..? జగన్ ఒక్కడిదే ప్రాణమా..? మిగిలిన వారి ప్రాణాలకు విలువ లేదా..? సొంత బాబాయ్ ని గొడ్డలితో హత్య చేస్తే గుండె పోటు అని చిత్రీకరించిందెవరు..? వారి హత్యకు న్యాయం జరగకుండా దోషులను కాపుడుతున్నదెవరు..? అంటూ వైసీపీ పై ప్రశ్నల వర్షమే కురిపించారు.
ఎన్నికల కోసం దాడుల పేరుతో మీరు చేసే డ్రామాలు ఇక చాలు ఆపండి, ఇక మీ పులి కథలు నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ పవన్ వైకాపా నాయకుల పై రెచ్చిపోయారు. అలాగే విశాఖ ప్రజాగళంలో పాల్గొన్న బాబు పై కూడా రాయితో దాడి జరిగింది. దాని పై స్పందించిన బాబు బాంబులకే భయపడలేదు, ఈ రాళ్లకు భయపడతానా..? విజయవాడలో ఎవరో సీఎం పైన రాయి విసురుతుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎం చేస్తున్నారు..? రాష్ట్ర డీజీపీ ఎం చేస్తుంది..? ఇంటిలిజెన్స్ అధికారులు ఎం చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు.
జగన్ పై దాడి జరిగితే ఈ ఘటనను అందరూ ఖండించారు. కానీ కొందరు పేటీఎం బ్యాచ్ నేను రాళ్ళూ వేయించినట్లు చిత్రీకరిస్తున్నారు. గతంలో జగన్ కోడికత్తి దాడి, వివేకా హత్య నా పై నెట్టాలని ప్రయత్నించి వైసీపీ విఫలమయ్యింది. ఇప్పుడు అదే డ్రామా రక్తికట్టించాలని వైసీపీ మరోసారి తాపత్రయపడుతుందని, ఇక మీ డ్రామాలకు కాలం చెల్లిందంటూ హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది మేమా…లేక మీరా..? నేరం మా మీద నెట్టి లబ్ది మీరు పొందాలని ఆశిస్తున్నారు.
ఇది 2019 కాదు 2024 , అసలు రాష్ట్రంలోకి ఈ దాడుల సంస్కృతిని తీసుకువచ్చింది వైసీపీనే, సునీత చెప్పినట్లు వైసీపీ పునాదులు ఎప్పుడు రక్తంతో తడిచి ఉంటాయనేది వాస్తవము అంటూ, నా పై కర్రలతో, రాళ్ళతో దాడికి వచ్చిన వైకాపా నాయకులకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుంది అంటూ వత్తాసు పలుకుతూ ఆనాటి ఉన్నతాధికారులు ముందుకు వచ్చారు. మరి జగన్ పై దాడి జరిగితే మాత్రం ఈ ప్రాథమిక సూత్రాలు వైకాపా నాయకులకు వర్తించవా..? అంటూ బాబు వైసీపీ నేతలకు సూటి ప్రశ్న వేశారు.
Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…