
అప్ డేటెడ్ పొలిటిషన్ గా ఎప్పటికప్పుడు ఆయా రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాలు చేయడంలో అనుభవశాలి చంద్రబాబు. జగన్ ప్రభుత్వం వేసిన ఉచ్చులో చిక్కుని కొన్నాళ్ళు ఇబ్బందులకు గురైన బాబు ఇప్పుడ్డు రెట్టించిన ఉత్సహంతో తిరిగి రాజకీయ యాత్రలు మొదలుపెట్టారు.
“రా కదిలి రా..”అంటూ మొదలుపెట్టిన టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న బాబు వైసీపీ మంత్రుల మీద సెటైర్లు వేస్తూ పంచ్ డైలాగ్స్ పేల్చారు. ఆచంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ “డయాఫ్రామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి, ధాన్యానికి సంచులు అందించలేని వ్యక్తి పౌరసరఫరాల మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, కోర్ట్ ఫైళ్లు లేపేసేవాడు వ్యవసాయ మంత్రి” అంటూ సభా వేదిక మీద వైసీపీ మంత్రుల పనితీరుని సెటైరికల్ గా వివరించారు.
“గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్స్ లు వేసుకునే వ్యక్తి మహిళాసంక్షేమ” కోసం మాట్లాడుతుంది అంటూ పర్యాటక శాఖ మంత్రి రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా ఏఒక్కరి పేరు చెప్పకుండా ప్రజలకు అర్థమయ్యేలా బాబు చేసిన ప్రసంగాన్ని చూసిన టీడీపీ అభిమానులు “బాబుతో రాజకీయం మాములుగా ఉండదు మరి” అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్లు వేస్తున్నారు.
కర్ణాటక సిఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ఉదయం ప్రకటించారు. డెప్యూటీ సిఎం డీకే శివకుమార్ ఆ…
There have been multiple discussions about the possibility of Karnataka chief minister, Siddaramaiah stepping down…