Telugu

మావిగన్‌ని చంద్రబాబు ఎంత మాటనేశారు!

సిఎం చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలో టీడీపి కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమైనప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

“జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం. కానీ ఆయన రాజకీయాలలో ఉంటే రాష్ట్రానికి నష్టం. వైసీపీలో పై నుంచి కింద వరకు అందరూ సైకోల్లాగే ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్లపై జగన్‌ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి అక్కడ కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు నరికి రక్తాభిషేకాలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు.

ADVERTISEMENT

మేము అధికారంలోకి వస్తే ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతామని పోస్టర్లు వేసి మరీ హెచ్చరిస్తున్నారు. ఇదీ వారి పార్టీ అసలు రూపం.. అసలు సంస్కృతి. ఇలాంటి వారు రాజకీయాలలో ఉంటే అందరికీ ప్రమాదమే,” అని అన్నారు.

చంద్రబాబు నాయుడుపై అసూయతో లక్షల కోట్లు విలువ చేస్తే అమరావతిని పాడు బెట్టడం, అన్న క్యాంటీనలు మూయించేయడం, టిడ్కో ఇళ్ళకి వైసీపీ రంగులు వేసుకోవడం, పొలాలలో తన బొమ్మతో సర్వే రాళ్ళు వేయించుకోవడం, మూడు రాజధానులు మొదలు మావిగన్‌ వరకు అనేక చిత్ర విచిత్రాలు చేశారు.

మళ్ళీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా తలకాయలు నరుకుతామని పోస్టర్లు వేసి మరీ బెదిరిస్తున్నారు. పోలీస్ అధికారులను బట్టలూడదీసి రోడ్లపై నిలబెడతానని, చంద్రబాబు నాయుడుతో సహా అందరి భరతం పడతానని, ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణని రాష్ట్రంలో ప్రతీ పోలీస్ స్టేషన్‌ తిప్పిస్తానని హెచ్చరిస్తున్నారు.

కనుక మళ్ళీ అధికారం లభిస్తే అరాచకం చేస్తానని ముందే చెపుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు వంత పాడుతున్న వైసీపీ నాయకులను రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? గెలిపించాలి?

ఓట్లు వేసి 11 సీట్లు ఇస్తే జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్నారు కదా? శాసనసభకు వెళ్ళకపోతే పోయే, ఈ రప్పా రాప్ప బెదిరింపులు, మావిగన్లు ఏమిటి? దేనికి?

కనుక జగన్‌ బ్యాచ్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాదని రాజకీయాలలో ఉన్నంత కాలం రాష్ట్రానికి, ప్రజలకే ప్రమాదమని సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కాదనగలమా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sarrainodu Combo, But With A Bigger Game?

Whenever Allu Arjun and Boyapati Srinu are mentioned together, Sarrainodu naturally comes to mind. But…

8 minutes ago

Rs 40 Cr Supari For Viveka Murder: CBN Reveals Details!

The highly controversial murder of former MP and the brother of late CM YS Rajasekhar…

38 minutes ago