పల్లె పండుగ 3.0.. వైసీపీలు చూస్తున్నారా?

Chandrababu and Pawan Kalyan at Palle Panduga 3.0

నెల్లూరు జిల్లా రామాపురంలో నేడు పల్లె పండుగ 3.0 సభ జరిగింది. దీనిలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సభలో వారు ఏం మాట్లాడారో ప్రజలందరూ ఇప్పటికే విని ఉంటారు. కనుక క్లుప్తంగా రెండు ముక్కలు చెప్పుకొని అసలు విషయానికి వద్దాం.

ADVERTISEMENT

గత ప్రభుత్వ హయంలో గ్రామాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి ఏవిధంగా జరిగిందో చక్కగా వివరించారు.

అసలు విషయం ఏమిటంటే, ఈ సభలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ పరస్పరం గౌరవించుకుంటూ ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

“నా అనుభవం పవన్ కళ్యాణ్‌ చురుకుదనంతో రాష్ట్రాన్ని ముఖ్యంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని,” చంద్రబాబు నాయుడు చెప్పగా, ఆయన నాయకత్వంలో మేమందరం గ్రామీణాభివృద్ధి జరుపుతున్నామని,” పవన్ కళ్యాణ్‌ చెప్పడం ఇందుకు చక్కటి ఉదాహరణ.

ఒక్క పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులే కలిసి మెలిసి పనిచేయడం చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, కూటమిలో రెండు పార్టీల అధినేతలు ఇంత సఖ్యతగా ఉండటం, సఖ్యతగా ఉన్నామనే విషయం ప్రజలకు కూడా అర్ధమయ్యేలా వ్యవహరించడం చాలా అభినందనీయమే. చాలా అవసరమే.

ఇది ప్రజలకు, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారికి చక్కటి సందేశం ఇచ్చినట్లవుతుంది కూడా.

ఇది వరకు వైసీపీ అధికారలో ఉన్నప్పుడు జగన్‌ ప్రభుత్వం ఇంతకంటే చాలా బలంగా, స్థిరంగా ఉండేది. కానీ ఐదేళ్ళపాటు తప్పుడు సంకేతాలే వెళ్తుండేవి. అందుకు ఆయనతో పాటు వైసీపీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు అందరూ మూల్యం చెల్లించక తప్పలేదు.

కనుక నేడు జరిగింది పల్లె పండుగ 3.0 సభ మాత్రమే కాదు.. కూటమి ఐఖ్యత, పరస్పర గౌరవాభిమానాలకు ప్రతీకగా కూడా చూడవచ్చు.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపి, జనసేనల మద్య ఏదో పెద్ద యుద్ధం జరిగిపోతోందనుకునే వారు, తప్పకుండా ఈ సభలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లను ఓసారి చూడటం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories