పవన్ కళ్యాణ్ ఇక పై ‘ఎంపవర్ స్టార్’…

Upasana Konidela Pawan Kalyan Empower Star

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మీ అందరికీ ‘పవర్ స్టార్’లా కనిపిస్తే, పిఠాపురం అభివృద్ధిని చూశాక తనకు మాత్రం ఆయన ఒక ‘ఎంపవర్ స్టార్’ లా కనిపిస్తున్నారంటూ ఉపాసన పవన్ పై ప్రశంసలు కురిపించారు.

అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పిఠాపురంలోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం రూపొందించిన ‘ఆరంభ్’ కార్యక్రమాన్ని నేడు ఉపాసన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, పవన్ రాకతో పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మారుతున్న తీరును కొనియాడారు.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పర్యాటక రంగం, వ్యవసాయం, యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని ఉపాసన పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ మార్పులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత పిఠాపురంలో అనేక కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి, మరికొన్ని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

అలాగే పవన్ తన నియోజకవర్గంలో మహిళలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తూనే వస్తున్నారు. మహిళలను ఆకర్షించుకునేలా రాఖీ పండుగ పర్వదినాన పిఠాపురం మహిళకు ఒక సోదరుడిగా ‘చీరల’ పంపిణీ చేస్తున్నారు. ఇక మహిళలకు అత్యంత పవిత్ర మాసంగా భావించే శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి పుట్టింటి కానుక కింద వారికీ ‘పసుపు కుంకుమ’ అందజేస్తున్నారు.

ఇలా పవన్ పిఠాపురం మహిళలకు ఒక పెద్దన్న పాత్రలో అటు అభివృద్ధిలోనూ, ఇటు ఉపాధిలోనూ, అలాగే సంప్రదాయంలోనూ తోడుగా ఉంటూ ఉపాసన చెప్పినట్టుగా మహిళా ‘ఎంపవర్ స్టార్’ గా మారారనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories