‘ప్రజారాజ్యం’ ఎందుకు పెట్టావు నాయనా..!

chandrababu-says-why-prajarajyam-started-chiranjeeviకాపు వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి తుని ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబును నిందిస్తూ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే అసలు చిరంజీవి లేఖ రాయడానికి గానీ, కాపుల గురించి ప్రస్తావించడానికి గానీ ఏమి అర్హత ఉందని సిఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“ప్రజారాజ్యం పార్టీ పెట్టింది దేనికీ… కాపులకు న్యాయం చేయాలని కాదా..?” అంటూ చిరును ఎద్దేవా చేసారు. “ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినపుడు కాపులకు ఏం చేసావు నీవు? కాంగ్రెస్ లో విలీనం చేసింది… కాపులను బీసీల్లో కలపడానికి కాదా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాళ్ళు ఏం చేసావు? కాపుల కోసం పార్టీ అన్నావు… నీవు మాట్లాడుతున్నావా..!” అంటూ మెగాస్టార్ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ADVERTISEMENT

1994 నుండి 2014 వరకు ఎవరూ మాట్లాడలేదు. కానీ, తామూ ప్రకటన చేసిన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాయని రాజకీయ పార్టీల తీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు. కాపు సంఘాలకు అన్ని అంశాలను వివరించానని, కాపులలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని పరోక్షంగా ప్రత్యర్ధి వర్గాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు.

అయితే మెగాస్టార్ పై బాబు చేసిన ‘పార్టీ పెట్టి కాపులకు ఏం చేసావు’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సొంత ఊరుకే ఏమీ చేయడానికి ముందుకు రాని చిరంజీవిపై కాపు ప్రజానీకం కూడా ఎటువంటి ఆశలను పెట్టుకోలేదు. అందుకే రాష్ట్రంలో కాపుల శాతం ఎక్కువగా ఉన్నా, చిరు పార్టీ కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితమైంది. లేని పక్షంలో ఫలితాలు వేరేగా ఉండేవి. అన్నయ్య తరపున తమ్ముడు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినా ఫలితం లేకపోయింది. అంటే జనాలు ఒకసారి ఫిక్సయిన తర్వాత ఎంత మంది ప్రచారం చేసినా ఆ ఫలితాలలో పెద్దగా ప్రభావం ఉండదని నిరూపించిన ఘటన అది. కాదంటారా..?!

ADVERTISEMENT
Latest Stories