తమిళనాడులో ఏపీ “చంద్రన్న కానుక”

Chandranna kaanuka in tamilnaduఏపీలో ప్రజలు పండగలు జరుపుకునేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో ‘చంద్రన్న కానుక’ పేరుతో నిత్యావసర వస్తువులను ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సంక్రాంతి పర్వదినం కానుకగా ప్రభుత్వం విడుదల చేసిన ‘చంద్రన్న కానుక’ సరుకులు తమిళనాడులోని కిరాణ దుకాణాలలో ప్రత్యక్షం కావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని కొన్ని పట్టణాల్లో చంద్రన్న సంక్రాంతి కానుక వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న అధికారులు వాటిపై దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ డీలర్లు ఈ సరుకును పక్కదారి పట్టించారనే దానిపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టినట్టు సమాచారం.

ADVERTISEMENT

మరోవైపు రేషన్ కార్డులు ఉండి కూడా సరుకులు తీసుకోని వారికి సంబంధించిన ‘చంద్రన్న కానుక’ సరుకులను కొందరు డీలర్లు ఇలా రాష్ట్రం దాటించినట్టు తెలుస్తోంది. మరి పొరుగు రాష్ట్రంలో ప్రత్యక్షమైన చంద్రన్న కానుకపై అధికారులు సీరియస్ గా విచారణ జరుపుతారా లేక తూతూ మంత్రంగా ముగించేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories