ఈ సినిమాను లైట్ తీసుకోవడం ఉత్తమం!

Chandrodayam First Lookఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ గా భావిస్తున్న “చంద్రోదయం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడం, అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురికావడం రెండూ జరిగిపోయాయి. చంద్రబాబు పాత్రను పోషించిన వినోద్ నవ్వులకు పెట్టిన తెల్లటి గడ్డం ఒక్కటి చాలు, నెటిజన్లకు ఆహారంలా మారింది.

ADVERTISEMENT

[m9ad]

బాబు బయోపిక్ లో నటించడం తన పూర్వజన్మసుకృతంగా వినోద్ భావించడం సబబే గానీ, అది సరైన పంథాలో ప్రజెంట్ చేయకపోవడం చంద్రబాబుకు మైనస్. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబును ప్రతిబింబిస్తూ రానా పోస్టర్స్ అదిరిపోయేలా ఉండడంతో, ఈ వినోద్ లో బాబు గారిని అభిమానులు అస్సలు చూడలేకపోతున్నారు.

అయినా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా ఎక్కడా నాణ్యత కనిపించడం లేదు. ఏదో బి గ్రేడ్ మూవీ మాదిరి, ఫోటోషాప్ చేసిన పోస్టర్స్ మాదిరి కనిపిస్తున్నాయి తప్ప, ఈ “చంద్రోదయం”లో విషయం కనిపించడం లేదు. అక్టోబర్ లో విడుదల చేస్తామని చెప్తోన్న ఈ సినిమాను బాబు గారి అభిమానులు లైట్ తీసుకోవడం బెటర్!

ADVERTISEMENT
Latest Stories