ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై చీటింగ్ కేసు నమోదైంది. నిర్మాత భువనేశ్వర్ అనే నిర్మాత రాజమౌళి తనకు ప్లాటు అమ్ముతానని చెప్పి మోసం చేశారని పేర్కొంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన నాంపల్లి కోర్టు రాజమౌళికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2012లో నగరంలో ఎమ్మెల్యే కాలనీలోని ఫొటోగ్రాఫర్స్ కాలనీలో ఫ్లాట్‌ను తనకు విక్రయిస్తానని చెప్పి, మరొకరికి అమ్మారంటూ నిర్మాత భువనేశ్వర్ రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. కాగా అప్పటి నుంచి రాజమౌళి కోర్టుకు హాజరుకాకపోవడంతో సమన్లు జారీ చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





