టీజర్ టాక్ – పెళ్లితో కూడిన ఫన్!

‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్, మొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకుని “చి|| ల|| సౌ||?” సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్ ను హీరో రానా సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసారు.

పెళ్లి అంటే ఇష్టం లేని ఓ యువకుడ్ని, పెళ్లి చేసుకోవాలని అందరూ చెప్పడం ఫన్నీగా ఈ టీజర్ లో చూపించారు. హనుమంతుడి భక్తుడిగా, సల్మాన్ ఖాన్ వీరాభిమానిగా పెళ్లి అంటే ఇష్టంలేని పాత్రలో సుశాంత్ నటించగా, హీరోయిన్ గా రుహని శర్మ నటించింది. ప్రశాంత్ విహారి జోష్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

ADVERTISEMENT

ఫన్నీగా ఉన్న ఈ టీజర్ లో సుశాంత్ ఫ్రెష్ గా ఉన్నాడు గానీ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అయితే లేడన్నది స్పష్టం. పెళ్లిపై వేణు ‘స్వయంవరం’ వంటి చాలా సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే ఈ జోనర్ సినిమాలు హిట్ కావాలంటే, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని రెండు గంటల సేపు పంచాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories