హద్దులు చెరిపేసిన టాలీవుడ్ బ్యూటీ!

Chill Boss Video Song - Pragya Jaiswal‘కంచె’ సినిమాలో లంగా, వోణీలో తళుక్కుమన్న ప్రజ్ఞా జైస్వాల్, ఇటీవల “నక్షత్రం” సినిమాలో బీచ్ సాంగ్ లో బికినీలో అందాలు ఆరబోసి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే ఆ అందాల విందు వృధాగా పోవడంతో, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ నెల 11వ తేదీన “జయ జానకి నాయక” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘నక్షత్రం’ సినిమా మాదిరే ఈ సినిమాలోనూ ఓ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసిందన్న విషయం, తాజాగా విడుదలైన వీడియో సాంగ్ టీజర్ చెప్పకనే చెప్పింది.

‘చిల్ బాస్’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్ లో ప్రజ్ఞా తన హాట్ హాట్ లెగ్స్ ను ప్రదర్శిస్తూ అందాల విందు చేసింది. టాప్ లో ఓ షర్టు, లోయర్ లో షార్ట్ మాత్రమే ధరించి ఈ పాటలో చెలరేగిపోయినట్లుగా కనపడుతోంది. బహుశా ‘కంచె’ సినిమాతో బహుశా తాను ఎక్స్ పోజింగ్ చేయడానికి దూరమనే భావన, టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు వెళ్ళాయనుకుందో ఏమో గానీ, అందాల ప్రదర్శనకు తనకు ఎలాంటి హద్దులు లేవనే సంకేతాలను ఈ పాటల ద్వారా ఈ ముద్దుగుమ్మ పంపించినట్లవుతోంది.

ADVERTISEMENT

మరి ఇంత అందాల ప్రదర్శన చేసిన “జయ జానకి నాయక” సినిమా అయినా ప్రేక్షకులను అలరిస్తే, అమ్మడి కష్టం వృధా కాకుండా ఉంటుంది. ఇది కూడా ‘నక్షత్రం’ను అనుసరిస్తే గనుక, మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే చాలా సమయమే పట్టవచ్చు. విడుదలకు సిద్ధంగా ఉన్న “జయ జానకి నాయక” సినిమా తప్ప ప్రజ్ఞా చేతిలో మరో తెలుగు సినిమా లేదు. ‘కంచె’ సినిమాను మినహాయిస్తే ప్రజ్ఞా నటించిన ‘గుంటూరోడు, నమో వేంకటేశాయ, నక్షత్రం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను చవిచూసాయి. దీంతో ఈ బ్యూటీ ఆశలన్నీ బోయపాటి పైనే పెట్టుకుందని ఈ పాట చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories