ప్రైవేట్ అన్నారు… పబ్లిక్ అయిపోయాయి కదా… చిరు..!

chiranjeeve daughter sreeja second marriageమెగాస్టార్ చిరంజీవికి రెండవ కూతురు శ్రీజ వివాహ ముహూర్తం మరో నాలుగు రోజుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీన జరగనున్న పెళ్లి హడావుడి మెగాస్టార్ ఇంట్లో ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీజను పెళ్ళికూతురు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తోడి పెళ్లికూతురుతో కలిసి ఆసీనురాలై ఉన్న శ్రీజ మరియు మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ, బన్నీ, ఇతర మెగా కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలు నెట్టింట్లో సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఈ వేడుకను మొత్తం ప్రైవేట్ గానే నిర్వహించాలని చిరు కుటుంబ వర్గీయులు నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే మెగాస్టార్ కుటుంబం నుండి ఈ వివాహంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో శ్రీజ రెండవ వివాహం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఆ కార్యక్రమం అంతా జరపాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.

ADVERTISEMENT

అయితే చిరు కుటుంబం వ్యక్తిగతంగా నిర్వహించాలనుకున్న వేడుక ప్రస్తుతం పబ్లిక్ అయిపొయింది. చేతి కట్టుతో మెగాస్టార్ పసుపు కొట్టడం నాటి నుండి తాజాగా పెళ్లికూతురిని చేసిన నాటి వరకు శ్రీజ వివాహానికి సంబంధించిన ప్రతి అంశం బయటకు రావడంతో ఎవరో కుటుంబ సభ్యుల ద్వారా ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను విడుదల చేయిస్తున్నట్లుగా కనపడుతోంది. బహుశా మెగా అభిమానులకు సమాచారం చెప్పకుండానే చెప్పినట్లు ఉండడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అన్న కామెంట్లు వినపడుతున్నాయి.

chiranjeeve daughter sreeja wedding

ADVERTISEMENT
Latest Stories