మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. ఒకసారి రచయిత సృష్టించిన కధ వివాదం కారణంగా మొదలైన ఆలస్యాన్ని, మెగాస్టార్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స కొనసాగించింది. దీంతో మరో మూడు మాసాల వరకు సినిమా ప్రారంభానికి నోచుకోదని అంతా భావించారు. అయితే కుమారుడు చెర్రీ సినిమా రోజున లాంఛనంగా ప్రారంభించి, ఈ వార్త అభిమానులకు తెలియజేద్దామని అనుకున్నా, అదీ సాధ్యం కాలేదు.
తాజాగా మెగా కుటుంబ వర్గీయులే చిరు రీమేక్ సినిమా ‘కత్తి’కి అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 27వ తేదీన అధికారికంగా ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, మార్చి 28వ తేదీన చిన్న కుమార్తె శ్రీజ వివాహ మహోత్సవం ఉండడంతో, దాదాపు మరో నెల, రెండు నెలల వరకు సినిమా ప్రారంభించే అవకాశం లేదని టాక్. ప్రస్తుతం అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 2 లేక 3వ వారాలలో చిత్ర ప్రారంభం జరగవచ్చని తెలుస్తోంది. అంటే, ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా చిరు 150వ సినిమాకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది కుటుంబ వర్గీయులేనని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.



