చిరంజీవిపై ఈ న్యూస్ నమ్మొచ్చా?

Chiranjeevi 151 movie surender Reddy తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగష్టు 22వ తేదీన మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ప్రారంభం కానుందని సమాచారం. ఇటీవలే రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో ప్రారంభమవుతుందన్న విషయాన్ని ధృవీకరించారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులపై దర్శకుడు సురేందర్ రెడ్డి ఉండగా, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిర్మాణ సంస్థ నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ ఆసక్తికర సమాచారం హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జతగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించబోతున్నట్లుగా వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవ రూపం సిద్ధించుకుంటుందనేది ప్రశ్నార్ధకంగానే ఉంటోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలనే చాలా సెలక్టివ్ గా ఐష్ చేస్తోంది. అది కూడా తన పాత్రలకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న కధలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి మెగా కాంపౌండ్ నుండి వచ్చే చిత్రాలంటే… ఎక్కువగా హీరో సెంట్రిక్ గా ఉంటాయి తప్ప, ఇతర పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి మెగా కాంపౌండ్ లో నటించేందుకు ఐష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జరిగితే మాత్రం ‘ఊయ్యాలవాడ’ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చినట్టే!

ADVERTISEMENT
Latest Stories