ఈరోజు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. వాటిని బట్టి ధర్మస్థలి అని ఊరి బ్యాక్ డ్రాప్ ఈ కథ జరుగుతుందని స్పష్టం అవుతుంది. అలాగే చిరంజీవి గెట్ అప్ ని బట్టి, చేతబట్టిన కత్తిని బట్టి గతంలో మనం విన్నట్టుగా ఆయన సినిమాలో మాజీ నక్సలైట్ గా కనిపిస్తారు అనే వార్త నిజం కావొచ్చు.
అలాగే ఈ చిత్రానికి A Comrade’s Quest for Dharma అనే క్యాప్షన్ దానిని ధృవీకరిస్తుంది. మొత్తానికి చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా అలాగే చిత్రం కథపై ఉత్సుకత రగిలించేదిగా ఉంది. పోస్టర్ ని బట్టి సినిమాలో కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా కొరటాల శైలిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుందని కూడా నిర్మాతలు ధృవీకరించారు. ఈ ఏడాది ఆగష్టు కు విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా ఏడు ఎనిమిది నెలల వాయిదా పడింది. ఈ చిత్రం లాక్ డౌన్ కు ముందే దాని 40% షూటింగ్ పూర్తి చేసింది. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేదాని మీద స్పష్టత లేదు.
కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుంది. గతంలో ఆమె చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150లో నటించింది. ఆమె ఆచార్య షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. చాలా ఏళ్ల తరువాత మణి శర్మ చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. గతంలో వారిద్దరూ సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చారు.



