
కన్నడ “ఆప్తమిత్ర”ను సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగు, తమిళ భాషల్లో “చంద్రముఖి”గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాను అసలు మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిందట. ‘మనసంతా నువ్వే’ సినిమా దర్శకుడు వి.ఎస్.ఆదిత్యతో ఓ సినిమాను చేస్తానని మెగాస్టార్ మాట ఇవ్వడంతో… కన్నడ ‘ఆప్తమిత్ర’ను చూసి, ఆ సినిమా డివిడిని మెగాస్టార్ కు పంపించి రజనీ పోషించిన పాత్రను చేయాల్సిందిగా కోరారట.
అయితే మెగాస్టార్ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేస్తూ… ఇది వర్కౌట్ కాదని నిర్మోహమాటంగా చెప్పారట. దీంతో ఆ రీమేక్ అక్కడితో ఆగిపోవడం, ఆ తర్వాత సూపర్ స్టార్ చెంత వాలడం, భారీ హిట్టు కొట్టడం జరిగిపోయాయి. మెగాస్టార్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో దర్శకుడు ఆదిత్యా కాస్త అప్ సెట్ అయ్యారని, ముఖ్యంగా ఆ రీమేక్ వద్దని, ప్రస్తుతం ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ కు రీమేక్ ను ఎంచుకోవడం పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా టాక్.
“కత్తి” విషయం చిరు తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలియాలంటే మరో మాసం సమయం ఉంది గానీ, ‘చంద్రముఖి’ వద్దంటూ మెగాస్టార్ తీసుకున్న నిర్ణయం 100కి 200 శాతం కరెక్ట్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే చిరు అంటే ఆ సినిమాపై ఉండే అంచనాలు వేరు. కానీ, ‘చంద్రముఖి’ సినిమాలో చిరు ప్రత్యేకంగా చేయడానికంటూ ఏమీ ఉండదు. ఏదో మొహమాటానికి మెగాస్టార్ చేసి ఉన్నా… ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదనడానికి మరో ఆలోచన అవసరం లేదు.
‘బాబా’ వంటి దారుణ పరాజయం తర్వాత ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల కావడమే ‘చంద్రముఖి’ ఘనవిజయానికి అసలు కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ సినిమాల విషయంలో చిరు తీసుకునే నిర్ణయాలకు తిరుగుండవు అని చెప్పడానికి మరో ఉదాహరణగా ఈ ఉదంతం నిలిచిపోతుంది. కమర్షియల్ సినిమాల విషయంలో చిరు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చెప్పడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ, నాయక్, ఎవడు’ సినిమాలే నిదర్శనం. అంటే “కత్తి” కూడా కేక పెట్టించడం ఖాయమేనా..?!
The teaser of Chakkora - Lunar Love Bird has been released, offering a mix of…
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…