
మెగాస్టార్ నేరుగా కనపడకుండా… కేవలం షాడోలతో దర్శనమిచ్చినా గానీ, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అంటే… ఏ రేంజ్ లో ఈ సినిమా కోసం వేచిచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కేవలం 14 సెకన్ల పాటే సాగిన ఈ టీజర్ లో మెగాస్టార్ కాకుండా అసలు హైలైట్ గా నిలిచింది థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. ‘బ్రూస్ లీ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన సమయంలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నే ఇక్కడ వినియోగించడం విశేషం.
నిజానికి ఈ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అయితే అది ఒక దారుణ పరాజయానికి సంబంధించిన మ్యూజిక్ కావడంతోనే ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే మెగాస్టార్ చేసే హంగామా కోసం వేచిచూస్తున్న అభిమానులకు ఇలాంటివి పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ముఖ్యంగా రెండు కాళ్ళు కదుపుతూ మెగాస్టార్ చూపిన తీరు చూసి… ‘జస్ట్ టైం గ్యాప్ అంతే… టైమింగ్ లో గ్యాప్ ఉండదు…’ అంటూ పండగ చేసుకుంటున్నారు.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…