చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంప్లీట్ ఆపోజిట్

Chiranjeevi - Pawan Kalyan completely differentమెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక తల్లి పిల్లలైనా ఇద్దరు కంప్లీట్ ఆపోజిట్ గా తమ లాక్ డౌన్ బ్రేక్ ని గడుపుతున్నారు. గడచిన 24 గంటలలో వారిద్దరి తాజా ఫోటోలు విడుదల అయ్యాయి. లాక్ డౌన్ సమయాన్ని పవన్ కళ్యాణ్ తన ఫార్మ హౌస్ లో ప్రకృతి సాన్నిహిత్యంలో తనకు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ గడుపుతున్నారు.

ADVERTISEMENT

ఎప్పటిలానే జుట్టూ, గడ్డం భారీగా పెంచేసి తనదైన శైలిలో కనిపించారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఈ రోజు చిరంజీవి తాజా చిత్రాలు కూడా విడుదల అయ్యాయి. ఈ ఫోటోలలో చిరంజీవి పూర్తిగా గడ్డం, మీసం తీసేసి కనిపించారు. బరువు కూడా తగ్గి యంగ్ గా కనిపించే ప్రయత్నం చేశారు.

లాక్ డౌన్ కారణంగా ఇద్దరి సినిమాలు ఆగిపోయాయి. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కేవలం 40% మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా… తాజాగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే…. ఆయన వకీల్ సాబ్ సినిమా ఇంకా 20% షూట్ చెయ్యాల్సి ఉంది. ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సి ఉండగా… ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఆయన ఇంకో సినిమా 2021 రెండో భాగంలో గానీ విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories