ఎయిర్ పోర్టులో చిరంజీవి, రఘువీరాలు అరెస్ట్!

Chiranjeevi Raghuveera reddy arrest in rajahmundryముద్రగడను పరామర్శించడానికి కిర్లంపూడి బయలుదేరిన దాసరి నారాయణరావును రాజమహేంద్రవరం హోటల్ లో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దాసరి పరిస్థితి ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుండి చిరంజీవి, రఘువీరారెడ్డిలు కూడా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వీరిద్దరిని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకుని, సెక్షన్ 151ఎ క్రింద అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలో భాగంగా విమానాశ్రయం ఎదుట ధర్నా దిగారు.

మరికొద్దిసేపట్లో ముద్రగడ దీక్ష విరమించానున్నారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా ప్రభుత్వం విఐపీలను ముద్రగడ వద్దకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రాజకీయ లబ్ది కోసం వీరంతా కిర్లంపూడికి పయనమయ్యారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories