సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సినిమా ఇప్పుడు అటకెక్కింది. మహర్షి తరువాత వంశీ ఎటువంటి సినిమా చెయ్యకుండా మహేష్ కోసమే వేచిచూశాడు. ఈ తరుణంలో వంశీ చెప్పిన కథ నచ్చలేదని మహేష్ ఆ ప్రాజెక్టు కాదు అన్నాడు. తాజాగా ఆయన గీత గోవిందం వంటి పెద్ద హిట్ ఇచ్చిన పరశురామ్ తో పని చెయ్యనున్నట్టు సమాచారం.
ఈ ప్రాజెక్టు వచ్చే వారంలో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. 13 లేదా 14 తారీఖులలో ఉండవచ్చు అంటున్నారు. ఉగాది రోజున ముహూర్తం జరుపుకోనుందట. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. మరోవైపు చిరంజీవి – కొరటాల సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.
పరశురామ్ సహజంగా రొమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ కథలు ఎక్కువగా చేస్తుంటారు. దానితో మహేష్ కు ఆయన ఎటువంటి స్క్రిప్ట్ వినిపించారు అనేదాని మీద మహేష్ బాబు అభిమానులలో చర్చ జరుగుతుంది. పరశురామ్ కు ఇది మంచి అవకాశం. మహేష్ కు ఒక్క హిట్ ఇస్తే ఆయన స్టార్ లీగ్ లోకి వెళ్ళిపోయినట్టే.
ఈ సినిమా ఎప్పుడు విడుదల చెయ్యాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదని తెలుస్తుంది. మాములుగా అయితే సంక్రాంతికి రావాల్సి ఉన్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో అది కుదిరే అవకాశం లేదు. దీనితో వచ్చే ఏడాది వేసవిలోనే సినిమా విడుదలకు అవకాశం ఉంటుంది.





