రాజమౌళి నిర్ణయం కోసం వేచి చూస్తున్న చిరంజీవి

Rajamouli - Chiranjeevi-మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతుంది. చిరంజీవి ఒక ట్రైనర్ ని పెట్టుకుని బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఆశించిన ఫలితాలు రావడం లేదట. అయితే చిరంజీవి వయసు కారణంగా ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టడం మంచిది కాదని నిర్ణయించారు.

మొదట్లో ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించినా, ఇప్పుడు 2021 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ జులై 30, 2020 విడుదల చెయ్యాలన్నా వాయిదా పడటం ఖాయమని అంటున్నారు.

ADVERTISEMENT

ఆర్ఆర్ఆర్ ను తాజగా 2020 దసరాకు గానీ, 2021 సంక్రాంతి గానీ విడుదల చెయ్యడానికి ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ 2020 దసరాకు గానీ విడుదల అయితే చిరంజీవి సినిమా 2021 సంక్రాంతికి వస్తుంది. ఒకవేళ ఆ సినిమా 2021 సంక్రాంతి కి వస్తే… చిరంజీవి సినిమా 2020 దసరాకే వచ్చేస్తుంది.

సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ (చిరంజీవి సొంత బ్యానర్) పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories