కలర్స్ స్వాతి వెడ్డింగ్ బెల్స్!

Colors swathi -weddingమా టీవీలో ‘కలర్స్’ ప్రోగ్రాంతో ప్రారంభమైన కెరీర్, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ వరకు పాకి, విజయవంతమైన పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న స్వాతి, త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతోంది. అవును… ముద్దుముద్దుగా కనిపించే ఈ బొమ్మ, ఓ పైలట్ ను వివాహం చేసుకోబోతోంది. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా మారిన ఈ వెడ్డింగ్ కు సంబంధించిన డేట్స్ కూడా బయటకు వచ్చాయి.

ADVERTISEMENT

ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లో ఎన్ డైమండ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 7.33 నిముషాలకు వివాహం జరగనుండగా, సెప్టెంబర్ 2వ తేదీన సాయంత్రం 7.10 నిముషాలకు కోచిలో రిసెప్షన్ జరగబోతోంది. వరుడు వికాస్ మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా విధులు నిర్వహిస్తూ జకార్తాలో నివాసం ఉంటున్నాడు. త్వరలో ఓ ఇంటిలో అడుగు పెట్టబోతున్న స్వాతికి శుభాకాంక్షలు!

ADVERTISEMENT
Latest Stories