‘అర్జున్ రెడ్డి’ కమెడియన్ వెడ్డింగ్ బెల్స్!

Comedian Rahul Ramakrishna wedding bells‘అర్జున్ రెడ్డి’ ద్వారా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైన సుస్థిర స్థానం సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరికీ చెప్పకండి’ తనదైన శైలిలో కామెడీ చేస్తూ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

[m9ad]

ADVERTISEMENT

తనకు కాబోయే భార్యతో కలిసి సముద్రపు ఒడ్డున దిగిన ఫొటోను ఈ సందర్భంగా జత చేశాడు. అయితే వారి మొహాలు కనిపించకుండా ఫొటో ఉండటంతో… పెళ్లికూతురు ఎవరు? ఎలా ఉంటుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. మరోవైపు పెళ్లి వార్తను వెల్లడించిన రాహుల్ కు హీరోలు నిఖిల్, సుశాంత్, సిద్ధార్థ్ కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్ లతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories