హాస్పిటల్ లో అడ్మిటైనా సునీల్

Comedian Sunil Admitted in hospital
ప్రముఖ కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చాయి. మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారని వార్తలతో పాటు ఆయనకు వెంటిలేటర్ పెట్టి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున పుకార్లు వ్యాపించాయి. దీనితో సునీల్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు.

గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని, ఇటీవలి కాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్లే సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. సునీల్ వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నారట. ప్రస్తుతం సునీల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని ఆయన సిబ్బంది చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

గతంలో సునీల్ ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వచ్చేవి. దీనితో ఈ విషయం పెద్దదిగా మారడంతో మొదట్లోనే క్లారిఫికేషన్ ఇప్పించాడు సునీల్. కాగా కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ మధ్యలో హీరో పాత్రల వైపు మళ్లారు. మొదట్లో హిట్లు వచ్చినా ఆ తరువాత వరుస ప్లాపులతో మార్కెటు పోగొట్టుకున్నాడు.

దానితో తిరిగి కామెడీ పాత్రలకు తిరిగి వచ్చాడు. అయితే ఇప్పటివరకూ సరైన పాత్ర దొరకలేదు. ఇటీవలే విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా అసలు ప్రాధాన్యత లేని చిన్న పాత్రలో కనిపించాడు. అయితే రేపు విడుదలయ్యే రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories