అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కమ్యూనిస్టుల డబల్ యాక్షన్

Communists double game with pawan akalyan and chandrabau naiduకొన్ని రోజుల క్రితం బెంగళూరులో కమ్యూనిస్టు జాతీయ నాయకులు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విందు సమావేశాలు జరపడం అందరికి తెలిసిందే. దాదాపుగా రెండు గంటల పాటు వారు దేశరాజకీయాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు జనసేన దీక్ష వద్ద ప్రత్యక్షం అయ్యారు

రామకృష్ణ, మధు ఇద్దరూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగి పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. మధు అయితే ఒక మెట్టు ఎక్కి “చంద్రబాబా ఆయన జేజి నాన్నా, నరేంద్ర మోడీయా ఆయన బాబా అందరి అంతూ చూస్తాం”, అని హెచ్చరించారు. తరువాత పవన్ కళ్యాణ్ తో కమ్యూనిస్టు నాయకులు చెయ్యి చెయ్యి కలిపారు.

ADVERTISEMENT

దీనితో అసలు కమ్యూనిస్టుల విధానం ఏంటో? వాళ్ళు ఎటు ఉన్నారో అర్ధం కాక వారి మద్దత్తుదారులే తలలు పట్టుకుంటున్నారు. అయినా ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టులు అలానే ఉన్నారు కాదు. నాలుగు సీట్లు ఇచ్చే పార్టీ పంచన చేరడం అందులో ఇచ్చిన వారిబలంతో కనీసం రెండైనా గెలవాలనుకోవడం.

ADVERTISEMENT
Latest Stories