కబాలి రా… ఆ మాత్రం లేకపోతే ఎలా..!

Tollywood, stars, Kabali, Rajinikanth, Radhika Apte, Kabali audio launch, hyderabad, kollywood, Tamil movies, Tollywood, Director PA Ranjithసూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొంది. జూలై నుండి ఆగష్టుకు వాయిదా పడిందన్న వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ‘కబాలి’కి సంబంధించిన రిలీజ్ హంగామాకు మాత్రం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని భావిస్తున్న ‘కబాలి’ మొదటి ప్రీమియర్ షోను అత్యంత ప్రతిష్టాత్మక ఆడిటోరియంలో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

యూరప్ లో అతి పెద్దదైన లీ గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో ఈ సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో ప్రదర్శించబోతున్నట్లుగా సమాచారం. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో కొలువై ఉన్న ఈ ఆడిటోరియం ఎంతో ప్రత్యేకమైనది. సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ కు ఆ మాత్రం హంగామా లేకపోతే ఏంటి అన్నట్లుగా అధికారిక రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ రజనీ అభిమానులతో పాటు, సినీ వీక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories