
రాజకీయాలలో గెలుపు – ఓటములు, తప్ప విలువలు – విశ్వసనీయత, అంటూ ఏమి ఉండవా.? రాజకీయ నాయకులు చెప్పే మాటల వెనుక చేసే విమర్శల వెనుక కేవలం రాజకీయ లబ్ది మాత్రమే అంతిమ లక్ష్యమా.?
ఎన్నికల ప్రచారంలో పచ్చగడ్డి వేసిన భగ్గున మండిపోయే పార్టీల మధ్య ఫలితాల తరువాత దోస్తీలా.? అవును ప్రస్తుతం రాజకీయాల ట్రెండ్ పరిశీలిస్తే ఇదే వాస్తవం అనేది అవగతం అవుతుంది. ఇందుకు తెలంగాణలో జరుగుతున్న హడావుడి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.
నిన్నటి వరకు కత్తులు దూసుకున్న పార్టీలు అధికారం కోసం చేతులు కలుపుతున్నాయి, అలాగే పొద్దున్న లేస్తే నువ్వా – నేనా అంటూ మంటలు మండించుకున్న పార్టీలు ఇప్పుడు పదవి కోసం నువ్వు – నేను అంటూ పువ్వులు పంచుకుంటున్నాయి.
ఇన్నాళ్లు కాంగ్రెస్ కి బీజేపీ ‘బీ’ టీం అంటూ బిఆర్ఎస్ ప్రచారాలు సాగిస్తే ఇప్పుడు బీజేపీ, బిఆర్ఎస్ ఒక్కటయ్యి అమరచింతలో కాంగ్రెస్ ని పక్కన పెట్టాయి.
ఇక బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, వీటి మధ్య అంతర్గతంగా తెరచాటు సంబంధాలు కొనసాగుతున్నాయి అంటూ కాంగ్రెస్ చేసిన ఊకదంపుడు ప్రసంగాలు కాస్త నేడు కామారెడ్డిలో కలిసిపోయాయి.
కామారెడ్డి లో కాంగ్రెస్ – బిఆర్ఎస్ ఒక్కటయ్యి బీజేపీ కి షాక్ ఇచ్చాయి. దీనితో రాజకీయ పార్టీలకు అధికారం – ప్రతిపక్షం తప్ప పార్టీ సిద్ధాంతాలు – వాటి తాలూకా విధానాలతో అవసరం లేదా అనిపిస్తుంది. ఇక్కడ పార్టీల జెండాలు కాదు అధికారం అనే ఎజెండానే ముఖ్యమని స్పష్టమవుతుంది.
అయితే ఈ మొత్తం రాజకీయ పార్టీల రాజకీయ చదరంగంలో అంతిమంగా లాభపడేది రాజకీయ పార్టీ, ఆ పార్టీ నాయకుడు, కానీ నష్టపోయేది మాత్రం ఆ పార్టీని, నాయకుడిని నమ్మి పార్టీ జెండాను మోసే కార్యకర్తే అనేది కూడా తేటతెల్లమయింది. ఇకనైనా క్యాడర్ మేలుకుని ఈ అవకాశవాద రాజకీయ నాయకుల రాజకీయ క్రీడలో బలికాకుండా జాగ్రత్త వహించాలి.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…