మోడీతో రేవంత్‌ దోస్తీ… కాంగ్రెస్‌ అధిష్టానం సహిస్తుందా?

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో సాధారంగా స్వాగతం పలికారు. ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొని మోడీని పెద్దన్నగా అభివర్ణిస్తూ, గుజరాత్‌లాగ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రభుత్వానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

మోడీ నిన్న పర్యటన ముగించుకొని ఒడిశాకు బయలుదేరుతున్నప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి వీడ్కోలు పలికారు. మళ్ళీ అప్పుడూ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతూ పెద్ద జాబితా అందించారు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల కోణంలో నుంచి చూసిన్నట్లయితే ప్రధాని పట్ల తెలంగాణ సిఎం చాలా చక్కగా వ్యవహరించారని చెప్పవచ్చు. తెలంగాణ అభివృద్ధి కోసం ఓ మెట్టు దిగారని కూడా భావించవచ్చు. అయితే రాజకీయ కోణంలో చూసినప్పుడు ఈ విధేయతకు మరికొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణతో సహా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ప్రసన్నంగా ఉంచుకోక తప్పదు. ఏపీలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తున్న జగన్‌ ప్రభుత్వం వారితో ఈవిదంగా ఉన్నందునే 5 ఏళ్ళు పూర్తి చేసుకోగలిగిందని చెప్పవచ్చు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి అదనంగా కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున, ఏ క్షణంలోనైనా కూలిపోతుందని లేదా కూల్చివేస్తామని బిఆర్ఎస్ నేతలు బెదిరిస్తూనే ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇంచుమించు అలాగే మాట్లాడుతున్నారు. కనుక రేవంత్‌ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ పట్ల ఇంత విధేయత ప్రదర్శించి ఉండవచ్చు.

అయితే దీనిని ‘బీజేపీ-కాంగ్రెస్‌ అనుబంధం’గా బిఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తోంది. ఇంతకాలం రహస్యంగా సహకరించుకున్న బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పుడు బహిరంగంగా చేతులు కలుపుకున్నాయని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. తమ వాదనలలో పస లేదని వారికీ తెలుసు. కానీ దీంతో సామాన్య ప్రజలను తికమక పరిచి లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.

తమ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసి నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్రమోడీతో సిఎం రేవంత్‌ రెడ్డి ఇంత విధేయంగా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్‌ అధిష్టానం మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే దానికీ సిఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు ఈవిదంగా వ్యవహరిస్తున్నారో బాగా తెలుసు.

అదీ గాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలద్రొక్కుకొని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బలపడాలంటే రేవంత్‌ రెడ్డి నాయకత్వం చాలా అవసరం. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఇదంతా చూసి చూడన్నట్లు ఊరుకుంటోంది… అనే విషయం సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా బాగా తెలుసు. కనుకనే ఇంత నిర్భయంగా, బాహాటంగా ప్రధాని మోడీతో సన్నిహితంగా మెలిగిన్నట్లు భావించవచ్చు.

సిఎం రేవంత్‌ రెడ్డి విధేయతని చూసి ప్రధాని నరేంద్రమోడీ కూడా సంతోషపడిన్నట్లే ఉన్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తూనే, తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్‌పార్టీలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జోలికి పోకుండా నివారించే అవకాశం ఉంది. ఈ రెండు జరిగితే రేవంత్‌ రెడ్డి రాజకీయం పనిచేసిన్నట్లే భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

BB Telugu: Shalini Under Target By Wild Entrants

The Bigg Boss journey of Agni Pareeksha contestant Apoorva has come to a close. By…

19 minutes ago

Are Paid Reviews Misleading OTT Audiences?

A film can have a weak trailer, little audience interest and still look like a…

39 minutes ago