బాబూ నాగబాబూ.. రాజకీయాలంటే జబర్దస్త్‌ షో అనుకున్నావా?

congress leader john wesley comments on Nagababu సినీ నటుడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాబూ నాగబాబూ.. రాజకీయాలంటే నువ్వు టీవీల్లో చేసే జబర్దస్త్‌ షో అనుకున్నావా.. అని ఎద్దేవా చేశారు. నాగబాబు గాజువాక జనసేన ఆత్మీయ సమావేశంలో బూతులు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, నువ్వు నటుడై ఉండి.. మీ సకుటుంబ సపరివారమంతా నటీనటులై ఉండి.. సాటి నటులను పెయిడ్‌ ఆర్టిస్టుగాళ్ళు అంటావా.. జాన్‌ వెస్లీ ప్రశ్నించారు.

నటులంతా మీ వెంటే తిరగాలా.. రాజకీయంగా వారికి వ్యక్తిగత ఇష్టాలు, పార్టీలు ఉండకూడదా.. అని ప్రశ్నించారు. తనకు నచ్చని విధానాలపై, పార్టీలపై నాగబాబుకు విమర్శించే హక్కుంది. కానీ ఇలా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్టు మాట్లాడటం అతని స్థాయిని బయటపెట్టింది. వెంటనే నాగబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి.. అని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలలో చాలా మంది నటులు వైఎస్సార్ కాంగ్రెస్ కు సపోర్టు చెయ్యడం గురించి మాట్లాడుతూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

అదే ప్రసంగంలో తన తమ్ముడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించేవారు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు, రాస్కెల్స్‌.. అని నాగబాబు అన్నారు. విపక్ష నేతలనుద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటం కూడా ఇప్పుడు చర్చకు తెరలేపింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు సినిమా ఆవేశం రాజకీయాలలోకి కూడా తెస్తున్నారని, అది పవన్ కళ్యాణ్ కు గానీ, జనసేనకు గానీ, చివరికి ఆయనకు గానీ మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories