‘నాన్నకు ప్రేమతో’ కాపీ కొట్టినట్లు ఉన్నారే..!

copied from NTR nannaku premathoసుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “నాన్నకు ప్రేమతో” సినిమాలో జూనియర్ తండ్రి పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ ఒక మేనరిజాన్ని కొడుక్కి అలవాటు చేస్తాడు. సినిమాలో ఎన్టీఆర్ రివెంజ్ స్కెచ్ తో మొదలైన ఈ మేనరిజం, చివర్లో రాజేంద్రప్రసాద్ చనిపోయే ముందు జూనియర్ ప్రదర్శిస్తాడు.

బుడ్డోడు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఈ స్టెప్ ను ఇటీవల ముంబై ఇండియన్స్ అభిమానులు మ్యాచ్ కు ముందు ప్రదర్శించారు. ఇటీవల కోల్ కోతాపై విజయం సాధించిన మ్యాచ్ ప్రారంభానికి ముందు పలువురు ముంబై ఇండియన్స్ అభిమానులు ఇచ్చిన మేనరిజం ‘నాన్నకు ప్రేమతో’ సన్నివేశంతో పోలి ఉండడంతో… బహుశా జూనియర్ సినిమాలో సన్నివేశాన్ని కాపీ కొట్టారేమో అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటో హల్చల్ చేస్తోంది. మరి మేనరిజం చూస్తుంటే అలాగే కనపడుతోంది..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories