ఆర్ఆర్ఆర్ టీంకు పూణే గండం?

Jr NTR - Ram Charan - Rajamouli - RRR-ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం… ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది జులై లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి 2021 సంక్రాంతికి వెళ్ళింది. కాగా ఈ నెలాఖరున ఆర్ఆర్ఆర్ బృందం ఒక కీలక షెడ్యూల్ కోసం పూణే వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల ఈ షెడ్యూల్ వాయిదా పడింది.

భారత దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. పైగా పూణే పరిసర ప్రాంతాలలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో తమ షెడ్యూల్ రద్దు చేసుకుంది చిత్ర బృందం. అయితే పూణే షెడ్యూల్ రద్దు కావడం ఆర్ఆర్ఆర్ టీం కు ఇదే మొదటి సారి కాదు.

ADVERTISEMENT

2019 జులైలో పూణే షూటింగ్ కి అని వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీం రామ్ చరణ్ కు గాయం కావడంతో షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చేసింది. దీనితో పూణే షెడ్యూల్ అనేదే కలిసి రావడం లేనట్టు ఉంది. పూణే షెడ్యూల్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ జాయిన్ కావాల్సి ఉంది. షెడ్యూల్ రద్దు కావడంతో రెండు సార్లు ఆమె షూటింగ్ లో పాల్గొనడం జరగలేదు.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా కోసం కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు.

ADVERTISEMENT
Latest Stories