థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలయ్యే మొట్టమొదటి సినిమా ఇదే

coronavirus first film-to-release-after-lockdown50% ఆక్యుపెన్సీ పరిమితితో అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లను తెరవడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. థియేటర్లను తిరిగి తెరిచేటప్పుడు అనుసరించాల్సిన ఎస్ఓపీలను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. దీనిపై వాటాదారులు ఎలా స్పందించబోతున్నారనే దాని గురించి మనకు ఇంకా తెలియరాలేదు.

ADVERTISEMENT

అయితే ఈలోగానే థియేటర్లను తిరిగి తెరిచిన వెంటనే తన సినిమా విడుదల చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అతని తదుపరి చిత్రం… కరోనా వైరస్ ఆరు నెలల విరామం తర్వాత ఆడియన్స్ కు బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అందించే మొదటి చిత్రం అవుతుంది.

“కరోనా వైరస్ చిత్రం లాక్ డౌన్ పరిస్థితిలో చిక్కుకున్న కుటుంబం గురించిన సినిమా. ఇది పూర్తిగా లాక్డౌన్ సమయంలో చిత్రీకరించబడింది. సినిమా థియేటర్లలో లాక్ డౌన్ ఎత్తిన తరువాత విడుదలయ్యే మొదటి చిత్రం అవుతుంది” అని రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇది ఇలా ఉండగా… ఎన్నో ఓటీటీలు ఇచ్చిన ఆఫర్లు కాదని థియేటర్లు ఓపెనింగ్ కోసం వెచ్చి చుసిన రామ్ తన తదుపరి చిత్రం రెడ్ ను అన్ని కుదిరితే దీపావళికి విడుదల చెయ్యాలని యోచిస్తున్నట్టు సమాచారం. అప్పటికీ అన్నీ కుదిరితే థియేటర్లో విడుదలయ్యే మొట్టమొదటి చెప్పుకోదగ్గ సినిమా రెడ్ అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories