మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వమే లేదు

CPI K Narayana comments on pawan kalyanఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వామపక్షాలు… 2019 ఎన్నికలలో కూడా కలిసి పోటీ చేశాయి. అయితే ఒక్క సీటులో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. వామపక్షాల పని అయిపోయింది అని అనుకున్నారో ఏమో పవన్ కళ్యాణ్ వారితో తెగదెంపులు చేసుకుని వారి బద్ధవ్యతిరేకైన బీజేపీతో జతకట్టారు.

ADVERTISEMENT

ఇప్పటివరకు దీనిపై పెద్దగా స్పందించలేదు వామపక్ష పార్టీలు.. మొదటి సారిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పవన్ కళ్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. “మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌కి వ్యక్తిత్వమే లేదు. ఆనాడు మాతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ‌‌.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నారు, అంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… వామపక్షాలతో పొత్తుకు ముందే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే అప్పుడు ఆయన తమకు అనుకూలం కాబట్టి నారాయణకు అవి కనిపించి ఉండవు. ఇప్పుడు పొత్తు విచ్ఛిన్నం అయ్యే సరికి అవన్నీ గుర్తు వస్తున్నట్టున్నాయి.

“దీనిబట్టి నారాయణకు అసలు వామపక్ష పార్టీలకు వ్యక్తిత్వం ఉందొ లేదో చూడాలి,” అంటూ జనసైనికులు కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. మూడు పెళ్లిళ్ల జోలికి వెళ్లకుండా నారాయణ పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విమర్శలు చేసి ఉంటే కొంత సప్పోర్టు వచ్చేదేమో

ADVERTISEMENT
Latest Stories