ఓటిటి వెబ్ సిరీస్ లను తలపిస్తున్న రియల్ క్రైమ్ స్టోరీస్.?

Crime Web Series Impact? Shocking Rise in Brutal Crimes

ఓటిటి పుణ్యమా అని వినోదం, అస్లీలం తో పాటుగా క్రైమ్ కథలు అన్ని కూడా ఇంటి లోపలకి వచ్చేసాయి. అయితే సినిమాలు, వెబ్ సిరీస్ లు సమాజంలో మంచిని ప్రోత్సహిస్తుందో లేదో చెప్పలేం కానీ చెడును మాత్రం యిట్టె ఆకర్షించేలా చేస్తుంది.

వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు వాడే భాష వెబ్ సిరీస్ ల పాపమే అంటూ డైరెక్టర్ చెప్పించిన డైలాగ్ ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణాలకు అద్దం పట్టేలా కనిపిస్తుంది. ఒక అక్రమసంబంధం కన్న ప్రేమను బలి తీసుకుంటుంది, కట్టుకున్న భర్తను సమాధి చేస్తుంది.

ADVERTISEMENT

ప్రియుడి కోసం కన్న బిడ్డను బలిచేసిన తల్లి, ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య, ప్రియురాలి కోసం కట్టుకున్న అర్ధాంగిని కడతేర్చిన భర్త…ఇలా నిత్యం ఎదో ఒక వార్త సమాజంలో పెరుగుతున్న హింసను, సమాజంలో తగ్గుతున్న మానవ సంబంధాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి.

అయితే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నది కరుడు కట్టిన నేరస్తులు కాదు, దోపిడీ దొంగలు కాదు, ప్రేమ పేరుతో కమ్ముకున్న కామం, దానితో వచ్చే ఉన్మాదం. మన ఇంటి పక్కన ఉండే సాధారణ వ్యక్తులు, నిత్యం మనతో కలిసి నివసిస్తున్న మన పక్కంటి వారో, ఎదురింటి వారో, మన కాలనీ వారో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్న దృశ్యాలను చుస్తున్నాం.

అయితే ఇటువంటి దారుణానికి సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విడాకులు తీసుకున్న మహిళతో అక్రమ సంబంధం కొనసాగించేందుకు ఆ మహిళ బిడ్డ అడ్డుగా ఉన్నాడని ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని నేలకేసి కొట్టిన సంఘటన ఏ ఓటిటి వెబ్ సిరీస్ లోదో కాదు, మన సమాజంలో జరిగింది.

ఇక తన భార్యతో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావ్ అని నిలదీసిన పాపానికి భర్తను కర్రతో చంపి వారికీ అడ్డుతొలగించుకున్నాడు ఒక ఉన్మాది. ఇక ప్రియుడి మోజులో పడి భర్తకు విడాకులిచ్చి తన కొత్త బంధానికి కన్న బిడ్డ అడ్డుగా ఉందని పేగు బంధాన్ని కూడా పాడెక్కించింది సదరు మహిళ.

అయితే ఈ ఘటన ల వెనుక జరిగిన దారుణాలు చూస్తే వెబ్ సిరీస్ లలో వచ్చే క్రైమ్ సస్పెన్స్ స్టోరీలను తలపిస్తున్నాయి. ఒక మనిషి ని చంపడం ఒక కోడి ని చంపినంత తేలిక అన్నట్టుగా జరుగుతున్నాయి ఈ దారుణాలు, ఘోరాలు.

అడ్డుగా ఉన్నారని అడ్డు తపించికోవడానికి చంపి, శవాన్ని ఎలా మాయం చేయాలో అని, పోలీసుల కళ్ళు కప్పి ఎలా తప్పించుకుని తిరగాలో అని అంతలా ఆలోచిస్తున్న వ్యక్తులు అసలు వాటి వాళ్ళ సాధించేమిటి.? చివరికి చిప్పకూడు తప్ప అనేది గ్రహించలేపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories