
డెకాయిట్ సినిమాని హిట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి అడివి శేష్ విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎన్నడూ కలెక్షన్స్ గురించి మాట్లాడని శేష్, థియేటర్లకి వెళ్లి మరీ “నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్” అని పదే పదే చెప్పడం కూడా గమనార్హం. ఆఖరికి సినిమా విడుదలైన మూడోవారంలో కూడా థియేటర్లు తిరుగుతూ ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు శేష్. నిజానికి అంత యాక్టివ్ గా తిరుగుతూ సినిమాని ప్రమోట్ చేస్తూ, జనాల్లో సినిమా ఉండేందుకు శేష్ పడుతున్న తపనను మెచ్చుకోవాల్సిందే.
అయితే.. కొన్నిరోజుల క్రితం నిర్మాత సుప్రియ ఓ డిస్ట్రిబ్యూటర్ కి రెండు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చిందనే వార్త హల్ చల్ చేసినప్పుడు, టీమ్ చాలా సైలెంట్ గా ఉన్నారు తమకి సంబంధం లేనట్లుగా. కానీ.. నిన్నటినుండి సడన్ గా అదే వార్తను పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి లాస్ రాకూడదు అని సుప్రియ జీఎస్టీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చిందని ట్వీటులు పడుతున్నాయి. మరోవారంలో డెకాయిట్ ఓటీటీ రిలీజ్ కానుంది. సో క్లోజింగ్ కలెక్షన్స్ బయటికి వస్తాయి. ఎంత మ్యానేజ్ చేసినా ఏ ఏరియా ఎంత కలెక్ట్ చేసింది? ఎంత లాస్ వచ్చింది? అనేది తెలిసిపోతుంది.
అందుకే.. ఈలోపు సేఫ్ గేమ్ మొదలుపెట్టారు. రెండు కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడం మంచి డిసిషనే, ఒకరకంగా డిస్ట్రిబ్యూటర్ కి అండగా నిలిచినట్లే. అయితే.. దాన్ని బట్టి సినిమా కంటెంట్ ను జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే క్లారిటీ వచ్చాక కూడా సినిమా విషయంలో ఇంకా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటూ బీరాలు పలకడం అనేది తమను తాము మోసం చేసుకున్నట్లే. ఓవర్సీస్ లోనూ డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు ఏమీ రాలేదు. చెప్పుకోవడానికి 1 మిలియన్ కలెక్ట్ చేసినప్పటికీ.. పాసులు ఎనేబుల్ చేయడం వల్ల అక్కడ రిలీజ్ చేసినవారికి పెద్దగా మిగిలిందేమీ లేదు.
మరి శేష్ తన తదుపరి చిత్రం “G2” విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…