బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ టీడీపీ పొత్తు విచ్చిన్నం కావడానికి ప్రధాన భూమిక పోషించారు. ఇప్పుడు 2019 ఎన్నికల ముందు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. ఈ దిశగా ఆ పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుపుతున్నట్టు సమాచారం.
జగన్ కూడా పురందేశ్వరి వస్తే ఆవిడ కోరిన విధంగా బాపట్ల గాని విజయవాడ ఎంపీ సీటు గానీ ఇవ్వడానికి సిద్ధం అని సంకేతాలు పంపారట. అదే విధంగా పురంధేశ్వరి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన పరుచూరు సీటు ఆశిస్తున్నారట.
జగన్ ఆమె పెట్టిన అన్ని కండిషన్లకు ఒప్పుకుంటే అప్పుడు పార్టీ మారడంపై ఒక నిర్ణయం రావొచ్చని సమాచారం. పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె కావడంతో ఆ రకంగా తమకు అనుకూలిస్తుందని జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారట. గతంలో కాంగ్రెస్ లో అనేక ముఖ్య పదవులు చేపట్టిన పురంధేశ్వరి రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరారు.