జన నాయకుడికి పట్టాభిషేకం? పరాభవమా?

Actor Vijay addressing supporters during Tamil Nadu election campaign

రేపు (ఏప్రిల్‌ 23) తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది.

కనుక రెండు పార్టీలకు చాలా బలమైన పార్టీ క్యాడర్, బలమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. వీటి వెనుక కాంగ్రెస్‌, బిజేపిలు కూడా ఉన్నాయి. ఇవి కాక ప్రతీసారి కనీసం 5-10 సీట్లు గెలుచుకోగల చిన్నా చితక పార్టీలు కూడా బరిలో ఉన్నాయి.

ADVERTISEMENT

రాజకీయ సమఉజ్జీలు జయలలిత-కరుణానిధి మరణించిన తర్వాత నాయకత్వ లోపం కారణంగా అన్నాడీఎంకే బలహీనపడగా, కరుణానిధి కుమారుడు స్టాలిన్ బలమైన నాయకత్వంలో డీఎంకే అధికారంలోకి వచ్చి మరింత బలపడింది.

ఇలాంటి పరిస్థితులలో కోలీవుడ్ హీరో విజయ్‌ టివికే పార్టీతో ఒంటరిగా బరిలో దిగారు.

ఆయనకు యువత, మాస్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నికలలో అధికార, విపక్షాలతో పోటీ పడి భారీగా డబ్బు ఖర్చు చేయగలరు. రాజకీయాలలోకి రావాలనే ఆలోచన ఉన్నందున చాలా కాలంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ విజయ్‌కి బొత్తిగా రాజకీయ అనుభవం లేదు. బలమైన క్యాడర్ కూడా లేదు.

ఒక పక్క దశాబ్ధాల రాజకీయ, ఎన్నికల అనుభవం, బలమైన క్యాడర్ కలిగి ప్రస్తుతం అధికారంలో ఉన్న బలమైన డీఎంకే, మరోపక్క సమాన అనుభవం కలిగి కేంద్రం తోడ్పాటున్న అన్నాడీఎంకే ఉన్నాయి.

ఈ వాస్తవాలతో పాటు కుల సమీకరణాలు కూడా చూసుకుంటే ఆ రెండు పార్టీల కంటే విజయ్‌ పార్టీ అన్ని విధాల వెనకబడి ఉందని అర్ధమవుతుంది.

కనుక విజయ్‌ పార్టీ వాటి ‘అసంతృప్తి ఓటర్లను’ చీల్చి కొన్నిటిని దక్కించుకోగలదేమో కానీ గెలిచి అధికారంలోకి రావడం అసంభవమే అనిపిస్తుంది.

ఇన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పుడు, వాటి మద్య ప్రజలు చీలిపోకుండా ఏకపక్షంగా విజయ్‌కి ఓట్లు వేయాలంటే ఆయన ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలిత స్థాయి నాయకుడై ఉండాలి. కానీ కారు కదా?

అలాగని విజయ్‌ ‘కింగ్ మేకర్’ అయినా ఆయనకే నష్టం. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పార్టీ ఇచ్చే భారీ బంపర్ ఆఫర్లతో టివికే జెండా, విజయ్‌ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కట్టకట్టుకొని ఎగిరిపోతారు.

కనుక విజయ్‌ ముందు ఒకటే ఆప్షన్ ఉంది. అది పూర్తి మెజార్టీతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావడం. కానీ అది సాధ్యం కాదు కనుక కనీసం ‘కింగ్ మేకర్’గానైనా కనపడాలనుకుంటే, నిసిగ్గుగా ఇంతకాలం తాను విమర్శించిన, వ్యతిరేకించిన పార్టీతో చేతులు కల్పాల్సిందే.

లేకుంటే బిజేపి స్నేహ హస్తం అందిస్తున్నా ఒంటరిగా బరిలో దిగినందుకు, సొంత ఎమ్మెల్యేలే మోసం చేసి వెళ్ళిపోయినందుకు బాధపడుతూ మళ్ళీ సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories