దగ్గుబాటి సురేష్ కారు తగిలి ప్రమాదం!

Suresh Babu Feared Fake Setup with Rajamouli & Others-ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న సురేష్ బాబు కారు, అదుపుతప్పి ఈ యాక్సిడెంట్ చేసింది.

[m9ad]

ADVERTISEMENT

కారు ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న దంపతులు, వారి మూడేళ్ల చిన్నారి కిందపడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. ప్రమాదం తరువాత దగ్గుబాటి సురేష్ బాబు, మరో వాహనాన్ని తెప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories