ట్రైలర్ టాక్ – లాస్ట్ పంచ్ అదిరింది!

deadpool-trailer-talk-last-punch-is-goodఇటీవల కాలంలో తెలుగు సినిమాల ఆదరణ పుణ్యమా అంటూ హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మల దిగుమతి కాస్త తగ్గింది. ఏవో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, గాడ్జిల్లా’ వంటి ఒకటి, రెండు చిత్రాలు తప్ప, మిగిలిన చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే తాజాగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ఒక డబ్బింగ్ బొమ్మ హడావుడి చేస్తోంది.

ఫిబ్రవరి 12వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమా పేరు “డెడ్ పూల్.” దీనికి సంబంధించిన తెలుగు వర్షన్ ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర నిర్మాణ సంస్థ ‘ఫాక్స్ స్టార్’ విడుదల చేసింది. హీరోకు సూపర్ శక్తులు ఎలా వచ్చాయి, ఆ తర్వాత హీరోయిన్ ను రక్షించుకోవడానికి వాటిని ఎలా వినియోగించుకున్నాడు అన్నదే చిత్ర కథాంశం.

ADVERTISEMENT

యథావిధిగా హాలీవుడ్ టెక్నికల్ వండర్స్ టెక్ ప్రియులను ఆకట్టుకోగా, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఆకర్షించే విధంగా రూపొందిన ఈ ట్రైలర్ లో చివరిగా పలికిన డైలాగ్… “ఓరి దేవుడోయ్… ఇలాంటి అమ్మాయిలతో వేగడం కష్టం..!” వీక్షకుల చేత నవ్వులు పూయించింది.

ADVERTISEMENT
Latest Stories