రీల్ లైఫ్ లో కలవలేకపోయారు… రియల్ లైఫ్ లో…!

It’s Official - Deepika Padukone Ranveer Singh To Get Marriedగత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన రణవీర్ సింగ్ – దీపికా పదుకునేల ప్రేమ వ్యవహారానికి శుభంకార్డు పడిపోయింది. రీల్ లైఫ్ లో “బాజీరావు మస్తానీ” ద్వారా ఒక్కటి కాలేకపోయిన ఈ జంట, రియల్ లైఫ్ లో ఏడడుగులు కలిసి వేస్తామని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 14 మరియు 15వ తేదీలలో తమ వివాహం జరగబోతోందని అధికారిక ప్రకటన చేయడంతో, ఇప్పటివరకు హల్చల్ చేసిన పుకార్లకు తెరపడింది.

నిజానికి ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతోంది. ఫైనల్ గా అదే నిజం కావడం, ‘నిప్పు లేనిదే పొగ రాదన్న’ సామెతను రుజువు చేస్తోంది. గతంలో సెలబ్రిటీల విషయంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో… సెలబ్రిటీల పెళ్ళిళ్ళపై ప్రేక్షకులలో ఏర్పడిన అభిప్రాయం రీత్యా… ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా ఈ జంట ఒక్కటై, చక్కని జీవితం సాగించాలని ఆశిద్దాం.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories