రిలీజ్ కు ముందు కింగ్ నాగార్జున ఇచ్చిన రెండు విభిన్నమైన స్టేట్మెంట్స్ నడుమ “దేవదాస్” విడుదలైంది. మరి నాగ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో వెలిబుచ్చిన అసంతృప్తి సరైనదేనా? లేక లేటెస్ట్ గా వేసిన ట్వీట్ నిజమా? అంటే మొదటి ఆప్షన్ కే ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఓటు వేసారన్న ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చింది.
[m9ad]
ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే… సినిమా అంతా రిచ్ గా ఉండి ప్రొడక్షన్ వాల్యూస్ ను (సాంగ్స్ తో సహా) స్క్రీన్ పై ప్రతి సీన్ లోనూ చూపిస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలు కనిపించడం… వారి మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలు… ఒకటి రెండు పాటలు… ఇలా అరకొరగా “దేవదాస్”కు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకుని కూడా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విఫలమయ్యాడనే టాక్ వెలువడుతోంది. క్లైమాక్స్ లో చూపించిన ఫన్, సినిమాలో ఎక్కువ శాతం పండించినట్లయితే “దేవదాస్”కు సింగిల్ టాక్ వచ్చి ఉండేదేమో గానీ, తొలుత వెలువడుతోన్న ‘ఫస్ట్ టాక్’ మాత్రం ఆశాజనకంగా లేదు.
‘ఛలో, గీత గోవిందం’ వంటి రెండు హిట్లతో టాలీవుడ్ కెరీర్ ను ఆరంభించిన రష్మిక గురించి చెప్పుకోవాల్సింది ఏమి లేదంటే, మొదటి సినిమాతో పరిచయం అయిన ఆకాంక్ష పేరు ప్రస్తావించనవసరం లేదు. ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కెరీర్ ను ఎటు వైపుకు తిప్పుతుందో అన్న ఆసక్తి అయితే ట్రేడ్ వర్గాలలో నెలకొంది.



