రిలీజ్ కు ముందు హీరోనే మిక్స్ డ్ రివ్యూ ఇస్తే ఎట్లా?

DevaDas-Press-Meet-Nagarjunaమరో రెండు రోజుల్లో నాగ్ – నానిలు నటించిన మల్టీస్టారర్ మూవీ “దేవదాస్” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా నాగ్, నాని, రష్మిక, ఆకాంక్షలతో పాటు నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యలతో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

[m9ad]

ADVERTISEMENT

ఈ ప్రెస్ మీట్ లో విచిత్రంగా నాగ్ ‘దేవదాస్’పై కాస్త అసంతృప్తికరమైన భావనను వ్యక్తపరచడం విశేషం. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయమై ప్రస్తావిస్తూ… చిత్రంలో ప్రధాన తారాగణం చాలా ఉందని, వారందరినీ సెట్స్ లో బాగానే హ్యాండిల్ చేసిన శ్రీరామ్, సినిమాను మాత్రం మూడు రోజుల క్రితమే ఇవ్వడం ఇబ్బందికరమని బహిరంగంగానే తన భావాన్ని వ్యక్తపరిచారు.

ఇలా అయితే సినిమాలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే కష్టమని, కనీసం ఒక నెల రోజుల ముందైనా సినిమాను అందించాలని, అలా అయితే అశ్వనీదత్ వంటి నిర్మాతలకు కూడా ఒకటికి పది సార్లు సినిమా చూసుకుని, లోటుపాట్లను సవరించుకునే అవకాశం లభిస్తుందని, ఇది ఒక్క శ్రీరామ్ కే కాదు, అందరి దర్శకులకు చెప్తున్నానని నాగ్ అన్నారు.

ఒకానొక సందర్భంలో శ్రీరామ్ బద్ధకంపై కామెంట్ చేసిన నాగ్, ఆ తర్వాత వాటిని కవర్ చేస్తూ భవిష్యత్తులో మాత్రం ఇలా కాకుండా చూసుకోవాలని సూచనలు చేసారు. సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు స్వయంగా నాగార్జునే అసంతృప్తికరమైన భావాలను సినిమా ఓపెనింగ్స్ ను దెబ్బతీయదా? ఈ అసంతృప్తిని మరో రెండు, మూడు రోజులు ఆపుకున్నట్లయితే బాగుండేదేమో అనిపించక మానదు.

కానీ, కింగ్ చెప్పుకొచ్చిన విషయంలోనూ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. గతంలో “హలో” రిలీజ్ కు ముందు దర్శకుడు విక్రమ్ కే కుమార్ పైన కూడా ఇలాగే ఆలస్యంగా ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం, ఆ సినిమా ఫలితం తెలిసిందే. ఒక నెల రోజుల ముందు నిర్మాత చేతికి సినిమా వస్తే, వారి అనుభవాన్ని అంతా ఉపయోగించి ప్రేక్షకులను అలరించే విధంగా అందించగలరన్న నాగ్ భావన సమంజసమో కానీ, వెల్లడించిన టైం మాత్రం రాంగ్ ఏమో!?

ADVERTISEMENT
Latest Stories