ఈ నెల 27 న విడుదల కానున్న దేవర విడుదలకు ముందే సోషల్ మీడియాలో తన హావ చూపిస్తుంది. దేవర నుండి విడుదలైన రెండు పాటలు కూడా సూపర్ హిట్ అవ్వగా జాన్వీ, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ ను చుట్టేస్తోంది.
ఇప్పటి ఈ పాట 100 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉంది. విడుదలైన అతి కొద్ధి కాలంలోనే చుట్టమల్లే ఈ రికార్డు ను సొంత చేసుకుంది. అటు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో, యూట్యూబ్ షాట్స్ తో సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేస్తోంది ఈ చుట్టమల్లే సాంగ్.
Also Read – కేజ్రీవాల్ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!
రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కు అనిరుధ్ అందించిన బాణీలు, ఎన్టీఆర్, జాన్విల కెమిస్ట్రీ, కొరటాల టేకింగ్ అన్ని కలిపి ఈ సాంగ్ ను 100 మిలియన్ వ్యూస్ రికార్డు దిశగా తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ మెలోడీ అయ్యింది. పుష్ప మూవీ తరువాత ఈ స్థాయిలో ఒక పాట సోషల్ మీడియాను షేక్ చేసిన దాకనాలు లేవననే చెప్పాలి.
ఈ పాట విడుదలైన వెంటనే ఇది ఆ సాంగ్ కి కాపీ, ఈ సాంగ్ కి పేరడీ కి అంటూ పోల్చిన నెటిజన్లు అనిరుధ్ పై ఘాటు విమర్శలు చేసినప్పటికీ మెల్లిమెల్లిగా ఈ సాంగ్ అందరికి ఫేవరేట్ గా మారిపోయింది. అయితే దేవర నుండి విడుదల కానున్న థర్డ్ సాంగ్ ఇంతకు మించి ఉంటుంది అన్న శాస్త్రిగారి మాటలకు తారక్ అభిమానులు సాంగ్ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Also Read – అతితెలివి ప్రదర్శించినా జగన్ దొరికిపోయారుగా!
శ్రీదేవి కూరుతుగా టాలీవుడ్ లో దేవర తో అడుగు పెట్టబోతున్న జాన్వీ కపూర్ తొలి సినిమాతోనే సూపర్ క్రెజ్ అందుకున్నారు. శ్రీదేవి కూతురు, ఎన్టీఆర్ మనవడు కలిసి ఇప్పటికే సోషల్ మీడియాను చుట్టేశారు ఇక వెండి తెర మీద కూడా ఎన్టీఆర్ తన స్టామినా చాటినట్లయితే ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా చుట్టేయడం ఖాయమే అంటున్నారు ట్రేడ్ పండితులు.