Telugu

వైసీపి ధోరణి ఇంతే! అధికారంలో ఉన్నా లేకపోయినా!

రాజకీయ పార్టీలు, వాటి నాయకులు మీడియా సమావేశాలలో, బహిరంగ సభలలో ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుంటే, వాటి మద్య సోషల్ మీడియాలో అంతకంటే ప్రమాదకరమైన యుద్ధాలు జరుగుతుంటాయి. తరచుగా ఆ యుద్ధాలు శృతిమించుతుంటాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది.

శాసనసభ ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత వైసీపి నేతలు, సోషల్ మీడియాలో వైసీపి హడావుడి కాస్త తగ్గిన్నట్లు కనిపించినా కేవలం నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ పుంజుకొని సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తోంది. చాలా జుగుప్సాకరమైన ఫోటోలు పెడుతోంది. ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తోంది.

ADVERTISEMENT

సిఎం చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం పరాకాష్టకు చేరడంతో, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సహనం కోల్పోయి, ప్రభుత్వంపై వైసీపి అంతగా దుష్ప్రచారం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర పోలీస్ అధికారులని, హోంమంత్రి అనితా వంగలపూడిని నిలదీశారు.

కానీ ఈవిషయంలో కూడా టిడిపి, జనసేనల కంటే వైసీపి చాలా ముందే ఉందని చెప్పవచ్చు. సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, తమ సోషల్ మీడియాలో పనిచేస్తున్నవారిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోందని వైసీపి రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

జగన్మోహన్‌ రెడ్డికి, వైసీపికి అండగా నిలబడి పోరాడుతున్న వైసీపి సోషల్ మీడియా వారియర్లని కాపాడుకోవడానికి జగన్‌ ఆదేశం మేరకు ఎన్టీఆర్‌ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ఏర్పాటు చేశామని, దానిలో లీగల్ సెల్ సభ్యులు కూడా అందుబాటులో ఉంటారని తెలియజేశారు.

ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనని ఓ భయంకరమైన విషనాగులాగ, రాక్షసుడులాగ బొమ్మలు వేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దానినే ప్రభుత్వంతో పోరాడటం అని చెప్పుకుంటోంది.

ఈవిదంగా చేస్తూ మళ్ళీ తామే ఆయన బాదితులమన్నట్లు వాదిస్తుండటం చూస్తే మొగుడిని కొట్టి కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్న భార్యలా అనిపిస్తుంది. జగన్‌కి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏళ్ళ పాలనలో అన్ని హద్దులు దాటేసినందునే ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వకుండా ఓడించి మూల కూర్చోపెట్టేశారు.

అయినా వైసీపికి ఏమాత్రం జ్ఞానోదయం కలుగలేదు. సోషల్ మీడియాలో కూడా వైసీపి అన్ని హద్దులు దాటేసింది. కనుక అందుకు అది తప్పక మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే, తమ తీరు సరికాదని తెలిసి ఉన్నప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది కనుక! దానికి రాజకీయ కక్ష సాధింపని కలరింగ్ ఇచ్చుకోవడం కూడా అతి తెలివే. కానీ అంత మాత్రన్న అది తప్పించుకోలేదని గ్రహిస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

21 minutes ago

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago