ఒకప్పుడు కొత్తదనం… ఇప్పుడు రొటీన్ కొట్టుడు…!

Dil- Rajuఈ తరం నిర్మాతలలో తెలుగు ఇండస్ట్రీకి టాలెంట్ ఉన్న నవతరం దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే, అది ఒక్క దిల్ రాజు సొంతమనే చెప్పాలి. తెలుగు తెరపై సరికొత్త కధలను అందంగా చూపించడంలో ‘బ్రాండ్ అంబాసిడర్’ అయిన దిల్ రాజు, గడిచిన కొద్ది సంవత్సరాలుగా తీస్తోన్న చిత్రాలు అందుకు విభిన్నంగా ఉండడం విశేషం.

ADVERTISEMENT

[m9ad]

ఏడాదికి నాలుగైదు సినిమాలు నిర్మిస్తున్నారు గానీ, అందులో ఒక్కటి కూడా ఓ “ఆర్య 2,” ఓ “బొమ్మరిల్లు,” ఓ “కొత్త బంగారు లోకం,” ఓ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లా ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలను మాత్రం నిర్మించలేకపొతున్నారు. మరీ ముఖ్యంగా గడిచిన రెండు సంవత్సరాలలో పూర్తిగా కమర్షియల్ పంథాకే పరిమితం అయిపోవడం ‘దిల్ రాజు అండ్ కో’ నుండి ఊహించని విషయం.

“నేను లోకల్, డీజే”తో ప్రారంభమైన ఈ ప్రస్థానంలో తాజాగా ‘హలో గురు ప్రేమ కోసమే’ కూడా వచ్చి చేరింది. ఇందులో కొన్ని కమర్షియల్ గా సక్సెస్ కావచ్చు, మరికొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ కొత్తదనంతో కూడిన సినిమాలను మాత్రమే నిర్మిస్తారు అన్న దిల్ రాజు బ్రాండ్ మాత్రం సినిమాసినిమాకు పడిపోతోందన్న విషయం గమనించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories