పవన్ ఫ్యాన్స్ ఆశలు మీదే నీళ్లు చల్లిన దిల్ రాజు

dil raju not allowed midnight shows for vakeel saabపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ చివరి సినిమా ఆజ్ఞతవాసి వచ్చి మూడు సంవత్సరాలు కావడంతో తమ అభిమాన హీరో ని చాలా మిస్ అవుతున్న ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా భయమున్నా సినిమాకు భారీ ఎత్తున హంగామా ప్లాన్ చేస్తున్నారు.

అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ దిల్ రాజు ఈ సినిమాకు అర్ధరాత్రి షోలకు అవకాశం లేకుండా చేశారు. 9వ తేదీ ఉదయం 4 లోపు ఎక్కడా షోస్ వెయ్యకూడదని తేల్చి చెప్పారట. అంతకు ముందు కీస్ ఇవ్వొద్దని క్యూబ్ కు కూడా తేల్చి చెప్పేశారట. దానితో అభిమానులు పూర్తిగా నిరాశపడిపోయారు.

ADVERTISEMENT

అయితే అంతకంటే ముందుగా అమెరికాలో మాత్రం షోలు పడే అవకాశం ఉంది. అంటే సినిమా మొదటి టాక్ కూడా అక్కడి నుండే వస్తుంది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 96 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. మరోవైపు… కరోనా కేసులు పెరగడం… థియేటర్లలో 50% ఆకుపెన్సీ తెస్తారు అనే రూమర్ల మధ్య ఏం జరుగుతుంది అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.

ఈ వేసవిలో విడుదల చేసిన మొదటి బిగ్గీ వకీల్ సాబ్. థియేటర్ల మీద ఆంక్షలు పెడితే చివరిది కూడా అయ్యే అవకాశం ఉంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎంసిఎ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హిట్ పింక్ యొక్క అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రంలో నటుడితో పాటు శ్రుతి హసన్ కనిపించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories